About Me
నమస్కారమండీ..!

  నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఎవరూ చూడడం లేదు అనిపించినప్పుడు, ఎక్కువ వాల్యూమ్ తో పాటలు పెట్టుకుని దానితో పాటు నేను గట్టిగట్టిగా (అరుస్తూ) పాటలు పాడుతుంటా. ఇది మనసుకు ఎదో తెలియని ప్రశాంతతను, ఆనందాన్ని, హాయిని, ఉల్లాసాన్ని ఇస్తుంది. నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది (మీకు కూడా అనిపించే ఉంటుంది) కొన్ని పాటలు నా కోసమే రాసినారేమోనని.

  మనం పాటలు పాడుకోవాలంటే లిరిక్స్ తెలిసి ఉండాలి. మన తెలుగులో లిరిక్స్ వెబ్ సైట్స్ చాలానే ఉన్నాయి. కానీ వాటి ఇంటర్ ఫేస్, లిరిక్స్ ప్రెజెంట్ చేసే విధానం నాకు నచ్చలేదు. అవి పాటలు పాడుకోవాలన్న ఇంటరెస్ట్ ని పోగొట్టేలా ఉన్నాయి అని నాకు అనిపించింది. అందుకే 12-09-2023న ఈ వెబ్ సైట్ ని ప్రారంభించాను.

  పాటల్లో ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ని ఫీల్ అవుతూ పాటలు పాడుకునే నాలాంటి వారికోసం మంచి ఇంటర్ ఫేస్ తో, మంచి లిరిక్స్ ప్రెజెంటేషన్ తో, యూసర్ ఫ్రెండ్లీగా ఉండేలా ప్రారంభించిన వెబ్ సైట్ ఇది అని నేను ఫీల్ అవుతున్నాను.

ధన్యవాదములతో
🙏
ఇట్లు
మీ మిత్రుడు




No comments:

Post a Comment